టీటీడీ నూతన ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. టీటీడీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎంకు భూమన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే భూమన తనయుడు అభినయ్ రెడ్డి కూడా సీఎం జగన్‌ను కలిశారు.