Homeతెలంగాణbrs:వెయిటింగ్​ లిస్ట్​ లో కామ్రేడ్స్​

brs:వెయిటింగ్​ లిస్ట్​ లో కామ్రేడ్స్​

బీఆర్ఎస్​తో పొత్తు ఉంటుందా? లేదా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్​ పొత్తు పెట్టుకుంటాయని జోరుగా ప్రచారం సాగింది. గత మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు బీఆర్ఎస్​ కు సపోర్ట్ చేశారు. అయితే తాజాగా కమ్యూనిస్టులను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. సీఎం అపాయింట్​ మెంట్​ కోసం కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నా.. కేసీఆర్ నుంచి రెస్పాన్స్​ రావడం లేదట.

కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించలేమని.. అవసరమైతే ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని బీఆర్ఎస్​ నుంచి ప్రపోజల్ వచ్చిందని టాక్. కానీ కమ్యూనిస్టులు మాత్రం తమకు పట్టున్న జిల్లాల్లో సీట్లు కేటాయించాలని అడుగుతున్నారట. దీంతో వాపపక్షాలతో బీఆర్ఎస్ తో పొత్తుపై సందిగ్ధం నెలకొన్నది. వామపక్షాలతో పొత్తు వద్దని కీలకనేతలు కేసీయార్ కు భావిస్తున్నారని టాక్​.

ఒకవేళ పొత్తు పెట్టుకున్నా.. వామపక్షాల నుండి బీఆర్ఎస్ కు ఓట్లు బదిలీ కావని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. పొత్తుపెట్టుకుని నష్టపోవటం తప్ప ఉపయోగంలేదని స్పష్టంగా చెప్పారని కారుపార్టీ నేతల సమాచారం. అందుకనే కేసీయార్ కూడా రెండో ఆలోచనకు వచ్చినట్లు పార్టీలో టాక్. ఈ కారణంగానే వామపక్షాలను దూరంగా పెడుతున్నారట. మరి ఇలా ఎంతకాలం ఏదీ తేల్చకుండా దూరంపెడతారో కేసీయార్ కే తెలియాలి. మొత్తంమీద కేసీయార్ ఆలోచను చూస్తుంటే పొత్తుల విషయంలో కమ్యూనిస్టులను వెయిటింగ్ లిస్టులో పెట్టినట్లే అనిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img