పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ
వైసీసీ, టీడీపీ శ్రేణుల పరస్పర దాడులు
ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఏపీలోని పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ చోటు చేసుకున్నది. ఇవాళ వివిధ జిల్లాల పరిధిలో 35 సర్పంచ్, 245 వార్డు స్థానాలకు ఎన్నికల జరుగుతోంది. ఏలూరు జిల్లా దెందులూరు సెగ్మెంట్ పరిధిలోని వీరమ్మకుంట పంచాయతీకి శనివారం ఎన్నిక జరుగుతుండగా ఇక్కడ ఉద్రికత్త చోటుచేసుకకున్నది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ లీడర్ చింతమనేని ప్రభాకర్‌ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సర్పంచి ఉపఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బొప్పడంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొన్నది.