HomeతెలంగాణTummala:తుమ్మల కన్ఫ్యూజన్​?

Tummala:తుమ్మల కన్ఫ్యూజన్​?

– పాలేరు టికెట్​ ఆశించిన మాజీ మంత్రి
– సిట్టింగ్​ ఎమ్మెల్యేకే కేటాయించిన గులాబీ బాస్​
– ఇతర పార్టీల వైపు తుమ్మల చూపు
– పాలేరు టికెట్​పై హామీ ఇవ్వని కాంగ్రెస్​?

ఇదేనిజం, స్పెషల్​ బ్యూరో: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు ప్రస్తుతం కన్ఫ్యూజన్​ లో ఉండిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగిన దశాబ్దాల పాటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కానీ ఒకే ఒక్క ఓటమి తుమ్మలను కుంగదీసింది. వచ్చే ఎన్నికల్లోనూ పాలేరు సెగ్మెంట్​ నుంచి బరిలో దిగాలని తుమ్మల భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్​ అక్కడ సిట్టింగ్​ ఎమ్మెల్యేకే టికెట్​ ఇచ్చారు. దీంతో ఇటీవల తుమ్మల అనుచరులు రహస్యసమావేశం నిర్వహించారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే తుమ్మల నాగేశ్వర్​ రావు ఏ పార్టీలో చేరబోతున్నారన్నది సస్పెన్స్​ గా మారింది.

కాంగ్రెస్​ నుంచి నో ఆఫర్​
తుమ్మల నాగేశ్వర్​ రావు కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికకు బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది. ఆయన రాకను పొంగులేటి తీవ్రంగా అడ్డుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు పాలేరు టికెట్​ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వలేదని దీంతో సమాచారం. దీంతో తుమ్మల నాగేశ్వర్​ రావు ఇండిపెండెంట్​ గా పోటీచేస్తారని కూడా ప్రచారం సాగుతోంది.
గతంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ టికెట్​ మీద గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్​ లో చేరారు. అప్పటినుంచి తుమ్మల పార్టీ కార్యకలాపాలకు దూరంగా, అంటీముట్టనట్టుగా మెలగుతూ వచ్చారు. మధ్యమధ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటూ.. మళ్లీ పాలేరునుంచే పోటీచేస్తానని ఏ పార్టీ తరఫున అనేది ఇంకా నిర్ణయించుకోలేదని రకరకాల సంకేతాలు ఇచ్చారు. మధ్యలో బీఆర్ఎస్​ కాస్త పూనుకుని ఆయనను బుజ్జగించింది. అయితే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. సిటింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే మళ్లీ ఇచ్చారు. దీంతో తుమ్మల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img