HomeతెలంగాణYellandu:ఇల్లందు వెరీ హాట్​

Yellandu:ఇల్లందు వెరీ హాట్​

– ఈ సెగ్మెంట్ టికెట్ కోసం కాంగ్రెస్​లో భారీ పోటీ
– 36 మంది దరఖాస్తు
– బొగ్గు గనుల నియోజకవర్గానికి భారీ డిమాండ్​
– సర్వే స్టార్ట్​ చేసిన హస్తం పార్టీ?
– ఆశావహుల్లో ఫుల్​ టెన్షన్​

ఇదేనిజం, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇల్లందు సెగ్మెంట్ కు కాంగ్రెస్​ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం కోసం కాంగ్రెస్​ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. దాదాపు 36 మంది దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థిగా గెలుపొందిన హరిప్రియా నాయక్​ తర్వాత బీఆర్ఎస్​ లో చేరారు. తాజాగా ఆమెకు మళ్లీ బీఆర్ఎస్​ టికెట్​ ఇచ్చింది. అయితే కాంగ్రెస్​ పార్టీ టికెట్​ ఎవరికి వస్తుందన్నది ప్రస్తుతం ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్నది. మంగళవారం వివిధ నియోజకవర్గాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలస్తున్నారు. కాగా, 119 నియోజకవర్గాలకు ఏకంగా 10,25 దరఖాస్తులు వచ్చాయి. 34 స్థానాల్లో 10 మందిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, హైలైట్ ఏమిటంటే ఒక్క నియోజకవర్గంలోనే ఏకంగా 36 మంది అప్లై చేశారు. ఈ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మంలో ఉంది. అంతేకాదు.. సింగరేణి బొగ్గు గనులకు ఇది ప్రసిద్ధి చెందినది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. అయితే, ఎమ్మెల్యే ఫిరాయించడంతో హతాశురాలైంది. 2014 లోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది.

పార్టీకి ఊపుతోనేనా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. సింగరేణి బొగ్గు గనులున్న ఈ నియోజకవర్గం ఉమ్మడి వరగంల్ కు సరిహద్దున ఉండేది. జిల్లాల పునర్విభన సందర్భంగా మొత్తం ఐదు మండలాల్లో 2 మహబూబాబాద్, రెండు ఖమ్మం, ఒకటి కొత్తగూడెం జిల్లాల్లోకి వెళ్లాయి. కాగా, ఇక్కడ విప్లవ పార్టీల ఆధిపత్యం ఎక్కువ. ఇదే కమ్రంలో గుమ్మడి నర్సయ్య వంటి నిస్వార్థ నాయకుడు ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2014 లో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య, 2018లో మహిళా అభ్యర్థి హరిప్రియ విజయం సాధించారు. అంటే వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీదే ఈ నియోజకవర్గం. ఇక్కడే కీలక పరిణామం జరిగింది. 2018లో గెలిచిన హరిప్రియ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఆమెకు మళ్లీ టికెట్ దక్కింది. 2014లో నెగ్గిన కోరం కనకయ్య మధ్యలో బీఆర్ఎస్ లోకి వెళ్లినా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ కు తెలంగాణలో ఊపు వచ్చింది. ఇదే సమయంలో టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానంతో భారీ స్పందన కనిపిస్తోంది. అందులోనూ గత రెండుసార్లు నెగ్గిన నియోజకవర్గం కావడంతో ఇల్లందు నుంచి 36 మంది ఔత్సాహికులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్వేల ఆధారంగా కాంగ్రెస్​ పార్టీ టికెట్​ ఇవ్వబోతున్నదని జోరుగా ప్రచారం సాగుతోంది.

అధిష్ఠానం ఏం చేయనుందో?
కాంగ్రెస్ అధిష్ఠానం ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రాథమికంగా ముగ్గురు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయనుంది. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో దరఖాస్తు చేసుకున్నవారిపై అంతర్గత సర్వే చేయించనుంది. అన్నింటినీ క్రోడీకరించి చివరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img