Homeఆంధ్రప్రదేశ్Balakrishna is active: నేనొస్తున్నా..

Balakrishna is active: నేనొస్తున్నా..

– టీడీపీ శ్రేణులకు బాలకృష్ణ భరోసా
– కార్యకర్తల్లో చర్చకు దారితీస్తున్న కామెంట్స్
– నందమూరి వారసుడు పార్టీ పగ్గాలు
చేపట్టున్నారంటూ ఊహాగానాలు

Balakrishna is active: ఇదే నిజం, ఏపీ బ్యూరో: ప్రముఖ నటుడు, హిందూపూర్​ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి టీడీపీలో యాక్టివ్​ అయ్యారు. చంద్రబాబు జైళ్లో ఉన్నారని ఆందోళన చెందొద్దని.. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. తాజాగా బాలకృష్ణ చేసిన కామెంట్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేనొస్తున్నా.. ధైర్యంగా ఉండండి’ అంటూ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో బాలకృష్ణ మాట్లాడుతూ… ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
‘పేద స్టూడెంట్ల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు.’ అని బాలకృష్ణ తెలిపారు.

‘మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను. నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపిద్దాం’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తర్వాత తమ భవిష్యత్ నేత లోకేశ్​ అని టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేసుకుంటుండగా.. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులు, నందమూరి అభిమానుల్లో చర్చకు దారితీశాయి. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని లోకేశ్​చేతుల్లో పెట్టే కంటే బాలకృష్ణ ముందుండి నడిపించడం బెటరని పార్టీలోని టీడీపీలోని ఓ వర్గం భావిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే టీడీపీలో నారా వారి హయాం ముగిసి మళ్లీ నందమూరి హవా మొదలవుతుందని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img