HomeతెలంగాణCongress party focus on Telangana: ’హస్తం’ మోహరింపు

Congress party focus on Telangana: ’హస్తం’ మోహరింపు

తెలంగాణను టార్గెట్​ చేసిన కాంగ్రెస్​

– ‘విజయభేరి’పై ఫుల్​ ఫోకస్​
– హైదరాబాద్​కు అతిరథ మహారథులు
– సర్వశక్తులు ఒడ్డుతున్న నేతలు
– ఆశావహులకు టార్గెట్​ పెట్టిన పీసీసీ చీఫ్​
– నియోజకవర్గం నుంచి 10వేలమందిని తరలించేలా ప్లాన్​
– జనసమీకరణ కోసం తీవ్ర ప్రయత్నాలు
– ముఖ్యనేతలు మొత్తం రాష్ట్రంలోనే మకాం
– తెలంగాణలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్​ వ్యూహాలు
– ఇచ్చిన పార్టీకి చాన్స్​ ఇవ్వాలని జనంలోకి..
– మెనిఫెస్టో మీద తీవ్ర కసరత్తు
– ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్న సోనియా గాంధీ

Congress party focus on Telangana:ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: హస్తం పార్టీ తెలంగాణపై మోహరించింది. ఈ దఫా పవర్​ మిస్​ చేసుకోవద్దని గట్టిగా స్కెచ్​లు వేస్తున్నది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ముఖ్యనేతలంతా హైదరాబాద్​లో ఒక్కొక్కరుగా అడుగుపెడుతున్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుటికీ కాంగ్రెస్​ ఫోకస్​ మాత్రం తెలంగాణ మీదే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు అవకాశం ఉందని.. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని.. బీఆర్ఎస్​ కు అసలైన ప్రత్యామ్నాయంగా తామే ఎదిగామని కాంగ్రెస్​ లెక్కలు వేసుకుంటున్నది. అందుకే తెలంగాణ మీద దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నది.

కాంగ్రెస్​ పార్టీ మీద తెలంగాణ ఫుల్​ ఫోకస్​ పెట్టింది. స్థానిక నేతలే కాకుండా.. అధిష్ఠానం మొత్తం తెలంగాణ మీదే గురిపెట్టింది. కాంగ్రెస్​ పార్టీలోని ముఖ్యనేతలంతా తెలంగాణ రాష్ట్రం మీదే ఫోకస్​ పెట్టారు. పక్క రాష్ట్రంలో గెలవడంతో తెలంగాణ మీద హస్తం పార్టీకి ఆశలు చిగురించాయి. అందుకే తెలంగాణలో ఈ సారి అవకాశాన్ని వదులుకోవద్దని కాంగ్రెస్​ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్​ ముఖ్యనేతలంతా తెలంగాణలో అడుగుపెట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమ మీద ఉన్న అభిమానాన్ని ఓటు బ్యాంక్​ గా మలుచుకోవాలని కాంగ్రెస్​ భావిస్తోంది. అందుకనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు కూడా హస్తం పార్టీకి అనుకూలంగా మారాయి. ఈ నెల 16, 17( శని, ఆదివారాల్లో) కాంగ్రెస్​ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం, భారీ బహిరంగ సభ జరగబోతున్నాయి.

నేతలకు రేవంత్​ హుకుం ఇదే..
తుక్కుగూడలో కాంగ్రెస్​ పార్టీ విజయభేరి సభను నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నది. ఈ మీటింగ్​ లో సోనియా గాంధీ పాల్గొని కీలక హామీలు ఇవ్వబోతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో మరోసారి సెంటిమెంట్​ రగిలించేలా చేయాలని ఆ పార్టీ భావిస్తున్నది. మరోవైపు స్థానిక కాంగ్రెస్​ నేతలకు సైతం ఈ సభ పెను సవాల్​ గా మారింది. భారీగా జనాన్ని తరలించాలని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఇప్పటికే టార్గెట్​ లు విధించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన దాదాపు 5 నుంచి 10 వేల మందిని తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి మాత్రమే కాక.. స్థానిక లీడర్లకు సైతం ఈ సభ ఎంతో ముఖ్యం. అందుకే ప్రతి నేత శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.

కుమ్ములాటలు వీడుతారా?
సహజంగా కాంగ్రెస్​ పార్టీనే అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ పార్టీలో ఎన్ని వర్గాలుంటాయో కూడా చెప్పడం కష్టం. కానీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కచ్చితంగా గ్రూపు రాజకీయాలు విడిచిపెట్టాలని.. పార్టీ హైకమాండ్​ స్ట్రాంగ్​ గా ఆదేశాలు జారీచేసిందని తెలిసింది. కాంగ్రెస్​ పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశాలు కాబట్టి.. లోకల్ లీడర్స్​ సైతం విబేధాలు పక్కకుపెట్టి పార్టీ కోసం పనిచేస్తారా? అన్నది వేచి చూడాలి. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లోనే ప్రస్తుతం లీడర్లు బలప్రదర్శన చేయడం ఖాయం. తాము టికెట్​ దక్కించుకోవాలంటే సభకు జనాలను తరలించడం కూడా ఓ ప్రాతిపదికగా తీసుకుంటారు కాబట్టి.. లోకల్​ లీడర్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సభను సక్సెస్​ చేయాలని చూస్తున్నారు.

మీడియా ఫోకస్​ కాంగ్రెస్​ మీదే..
తెలంగాణ రాష్ట్రంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగుతున్నాయి కాబట్టి నేషనల్​ మీడియా ఫోకస్​ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు హైదరాబాద్​ రాబోతున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. దీంతో జాతీయ మీడియా మొత్తం తెలంగాణ మీదే ఫోకస్​ పెట్టే చాన్స్​ ఉంది. దీంతో ఇతర పార్టీలు సైతం అటెన్షన్​ తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

సెంటిమెంట్​ + కీలక హామీలు
కాంగ్రెస్​ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్ రగిల్చడంతో పాటు కీలక హామీలను కూడా ఇవ్వబోతున్నది. గత ఎన్నికల సమయంలో సైతం తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్​ పార్టీ జనంలోకి వెళ్లింది. కానీ అప్పుడు వివిధ కారణాల వల్ల తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్​ పార్టీకి చేటు తెచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పక్కాగా సెంటిమెంట్ ను రగిలించాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది.

తాజ్​ కృష్ణకు చేరుకున్న కీలక నేతలు
కాంగ్రెస్​ పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలు హైదరాబాద్​లోని తాజ్​ కృష్ణ హోటల్​కు చేరుకుంటున్నారు. కాంగ్రెస్​ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటూ ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాజ్​ కృష్ణకు చేరుకున్నారు. రెండ్రోజులపాటు హైదరాబాద్​ లోని తాజ్​ కృష్ణ హోటల్​ లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు తుక్కుగూడలోని బహిరంగసభ స్థలి ఏర్పాట్లను కాంగ్రెస్​ పార్టీ నేతలు పరిశీలించారు.

Recent

- Advertisment -spot_img