Homeక్రైంED notices to Shraddha Kapoor శ్రద్ధాకపూర్​కు ఈడీ నోటీసులు

ED notices to Shraddha Kapoor శ్రద్ధాకపూర్​కు ఈడీ నోటీసులు

– మహాదేవ్​ బెట్టింగ్​ కేసులో ఈడీ దూకుడు

ఇదేనిజం, హైదరాబాద్​: మహాదేవ్​ బెట్టింగ్​ యాప్​లో ఈడీ దూకుడు దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు బాలీవుడ్​ నటులకు ఈడీ నోటీసులు అందజేయగా.. తాజాగా నటి శ్రద్ధా కపూర్​ కు సైతం ఈడీ సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నది. ఆమె నేడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్, హాస్యనటుడు కపిల్‌ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌కు ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. కాగా.. రణ్‌బీర్‌ కపూర్‌ కూడా శుక్రవారం రాయ్‌పుర్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా, ఆయన రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇక, కపిల్‌ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌ను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు.

Recent

- Advertisment -spot_img