Homeస్పోర్ట్స్Cricket in the 2028 Olympics 2028 ఒలింపిక్స్​లో Cricket

Cricket in the 2028 Olympics 2028 ఒలింపిక్స్​లో Cricket

– ఆమోదం తెలిపిన ఐవోసీ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ రీ ఎంట్రీకి ఆమోదం లభించింది. ఎప్పుడెప్పుడు విశ్వక్రీడల్లో క్రికెట్‌ను చూస్తామా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు మరో ఐదేండ్లలో నెరవేరబోతున్నాయి. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్​లో క్రికెట్‌ను భాగం చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నెల 13న సమావేశమైన ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు..

క్రికెట్‌తో పాటు సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోస్సె (సిక్సెస్‌), స్కాష్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేయబోతున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఆదివారం నుంచి ముంబైలో మొదలైన ఐవోసీ సెషన్స్‌లో ఈ ప్రతిపాదనను సభ్యుల ముందు ఉంచి ఓటింగ్‌ చేపట్టింది. ఈ ఓటింగ్‌లో 2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ప్రవేశం ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దాంతో లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగనున్నాయి.

Recent

- Advertisment -spot_img