HomeరాజకీయాలుFear of defeat for Modi government: VH Hanumantha Rao Modi...

Fear of defeat for Modi government: VH Hanumantha Rao Modi సర్కారుకు ఓటమి భయం పట్టుకుంది : VH Hanumanth Rao

– కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్​

ఇదే నిజం, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఓడిపోతామనే భయం పట్టుకుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ ఓడిపోతామనే భయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ స్కూల్ పుస్తకాల్లో ఇండియా పేరు తీసేసి భారత్ అని పెడుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రపంచంలో పేరున్న దేశం ఇండియా. ఎన్నికల కోడ్ పేరుతో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఎన్నికలను నేను ఎప్పుడు చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్‌ను చూడలేదు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు. సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారు’అని వీహెచ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img