Homeరాజకీయాలురైతన్నా.. ఆలోచించు

రైతన్నా.. ఆలోచించు

– కేసీఆర్ కావాలా? ఆరు దశబ్ధాలు ఆగం చేసిన వాళ్లు కావాలా?
– మంత్రి కేటీఆర్​ ట్వీట్​

ఇదేనిజం, హైదరాబాద్: రైతుబంధు, 24 గంటల కరెంట్​ ఇస్తున్నా కేసీఆర్​ కావాలా? లేక ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ ప్రజలను ఆగం చేసిన కాంగ్రెస్​ పార్టీ కావాలా? అని మంత్రి కేటీఆర్​ రైతులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటకలో కాంగ్రెస్‌ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను బేరీజు వేస్తూ.. ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు. ‘కేసీఆర్‌ ఇస్తున్న 24గంటల విద్యుత్‌ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇస్తున్న 5గంటల విద్యుత్‌ కావాలా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పిన 3 గంటల విద్యుత్‌ కావాలా? రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్‌ కావాలా?ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలా? నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా?’ అని కేటీఆర్‌ ట్వీట్​ చేశారు.

Recent

- Advertisment -spot_img