Homeసినిమా‘Animal’​ రన్​టైమ్​..Social Media లో ట్రెండింగ్

‘Animal’​ రన్​టైమ్​..Social Media లో ట్రెండింగ్

సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్‌ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్​బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన మూవీ యానిమల్. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌కు సంబంధించిన ఓ రూమర్ సోషల్‌మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. డిసెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యానిమల్ రన్‌టైమ్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా రన్​ టైమ్ 3 గంటల 20 నిమిషాలకు పైగానే అని సోషల్‌మీడియాలో కొన్ని పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇంత ఎక్కువ రన్‌టైమ్‌ ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ‘రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేయండి’అని మరికొందరు కోరుతున్నారు. అయితే దీనిపై మూవీ టీమ్​ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా సందీప్‌ వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘డిసెంబర్‌ 1న రణ్‌బీర్‌ కపూర్‌ విశ్వరూపాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి’అని చెప్పారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్​ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. గత నెలలో విడుదలైన రెండు పాటలు మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో రణ్‌బీర్‌ సరసన రష్మిక నటించింది. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. కంటెంట్‌, భావోద్వేగాల పరంగా ఇది చాలా పెద్ద సినిమా అని గతంలో సందీప్‌ వంగా చెప్పిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img