HomeరాజకీయాలుBJP ప్రశ్నలకు సమాధానం చెప్పరా?

BJP ప్రశ్నలకు సమాధానం చెప్పరా?

– ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

ఇదే నిజం, ఏపీ బ్యూరో: బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా.. ఇతరులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె.. శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని పురందేశ్వరి ధ్వజమెత్తారు. మద్యం అక్రమాలపై బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా, మద్యం విక్రయాలపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో భాజపా కలిసి పోటీ చేసే అంశంపై తమ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు.

Recent

- Advertisment -spot_img