HomeరాజకీయాలుTelangana elections: CPM first list released Telangana Elections : CPM ఫస్ట్...

Telangana elections: CPM first list released Telangana Elections : CPM ఫస్ట్ లిస్ట్ రిలీజ్

– కాంగ్రెస్​తో దోస్తి కటీఫ్​
– లిస్ట్​ వాయిదా వేయాలని జానారెడ్డి కోరినా పట్టించుకోని తమ్మినేని
–14 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల
– పాలేరు బరిలో తమ్మినేని వీరభద్రం
– సీపీఐ పోటీ చేసే స్థానాల్లో మద్దతు ఇస్తామని వెల్లడి

ఇదే నిజం, హైదరాబాద్: కాంగ్రెస్​తో దోస్తీకి గుడ్​ బై చెప్పిన సీపీఎం.. ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం ప్రకటించింది. మొదటి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు కోసం సీపీఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన విధంగా మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సీపీఎం కోరింది. అయితే హస్తం పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 17 సెగ్మెంట్లలో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను నేటి సాయంత్రంలోగా ప్రకటించే అవకాశముంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. బీజేపీ గెలిచే చోట ఓడించగలిగే అభ్యర్థులకే ఓటెయ్యాలని తమ్మినేని సూచించారు. సీపీఎంకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో తాము మద్దతిస్తామని, అక్కడ తాము పోటీ చేయడం లేదన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌సహా మరో స్థానానికి అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. పొత్తుపై కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తకుముందు కాంగ్రెస్‌ పార్టీ సీయర్‌ నేత జానారెడ్డి.. తమ్మినేనితో ఫోన్‌లో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా విడుదలను వాయిదా వేయాలని కోరారు. అయితే అది కుదరదని జానారెడ్డికి స్పష్టం చేశారు.

సీపీఎం మొదటి జాబితా ఇదే..

నియోజకవర్గం అభ్యర్థి

భద్రాచలం (ఎస్టీ) కారం పుల్లయ్య
అశ్వారావుపేట (ఎస్టీ) పిట్టల అర్జున్‌
పాలేరు తమ్మినేని వీరభద్రం
మధిర (ఎస్సీ) పాలడుగు భాస్కర్‌
వైరా (ఎస్టీ) భూక్యా వీరభద్రం
ఖమ్మం ఎర్ర శ్రీకాంత్‌
సత్తుపల్లి (ఎస్సీ) మాచర్ల భారతి
మిర్యాలగూడ జూలకంటి రంగారెడ్డి
నకిరేకల్‌ (ఎస్సీ) చినవెంకులు
భువనగిరి కొండమడుగు నర్సింహ
జనగాం మోకు కనకారెడ్డి
ఇబ్రహీంపట్నం పగడాల యాదయ్య
పటాన్‌చెరు జె. మల్లికార్జున్‌
ముషీరాబాద్‌ ఎం. దశరథ్‌

Recent

- Advertisment -spot_img