– టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహం
– రేవంత్ ఫ్లెక్సీలు దహనం చేసిన అనుచరులు
– టికెట్ అమ్ముకున్నారంటూ ఆగ్రహం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్ట్‌పై కూడా చిచ్చు రేగింది. పటాన్ చెరు టికెట్ దక్కకపోవడంతో కాటా శ్రీనివాసగౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పార్టీలో ఉన్న తనకు కాకుండా.. కొత్తగా వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ను ఇటీవల చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో కాటా అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున పటాన్ చెరులో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని కాటా అనుచరులు దహనం చేశారు. రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తన అనుచరుడికి టికెట్ దక్కకపోవడంతో దామోదర రాజనర్సింహ కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇప్పించేందుకు దామోదర రాజనర్సింహ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయినప్పటికీ అధిష్ఠానం ఆయన ప్రతిపాదనను పక్కకు పెట్టింది. దీంతో దామోదర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డిని ఇంటి ముందు ఆందోళన నిర్వహించేందుకు కాటా అనుచరులు సన్నద్ధమయ్యారు.