– 10 మంది భక్తులకు గాయాలు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఒరిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పూరీ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒడియా పంచాంగం ప్రకారం.. గత పౌర్ణమి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు పూరీ జగన్నాథుని దర్శనానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం ‘మంగళ ఆలటి’ నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా భక్తులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో ఆలయం మెట్లపై తొక్కిసలాట జరిగింది.