ఇదే నిజం, హైదరాబాద్: పెద్ద అంబర్పేట నుంచి అబ్దుల్లాపూర్ మెట్ మధ్య హైదరాబాద్-విజయవాడ హైపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండటం, మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా పార్టీ శ్రేణుల హడావుడితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాదారులు ఇబ్బంది పడ్డారు.