– నాంపల్లి కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ చెప్పిన చోట ఎంఐఎం పోటీ చేస్తున్నది ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లోని నాంపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ప్రజల సర్కారు వస్తుందని చెప్పారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు.