ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఐఆర్‌ఆర్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను డిసెంబర్ 1కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.