Homeతెలంగాణఓటర్ల నుంచి మంచి స్పందన వస్తున్నది

ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తున్నది

– అర్బన్​ ఏరియాల్లో నెమ్మదిగా పోలింగ్
– సీఈవో వికాస్​ రాజ్

ఇదే నిజం, హైదరాబాద్: కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత, కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోదరుడిపై ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు విచారణ చేపడతారన్నారు. ‘ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చాం. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాగా వస్తున్నారు. ఓటరు కార్డే కాకుండా ఆధార్‌, పాన్‌ తదితర 12 గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నాం. అర్బన్‌ ఏరియాల్లో పోలింగ్‌ నెమ్మదిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నాం. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తాం’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

Recent

- Advertisment -spot_img