Homeఆంధ్రప్రదేశ్మా నీళ్లు మేం తీసుకుంటున్నాం

మా నీళ్లు మేం తీసుకుంటున్నాం

– దానికి తెలంగాణ పర్మిషన్​ తీసుకోవాలా?
– ఏపీ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదు
– ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: సాగర్​ కాల్వ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి తప్పు లేదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఏపీ నీళ్లు తీసుకోవాలంటే దానికి తెలంగాణ పర్మిషన్​ తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. నాగర్జున సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారని ఆరోపించారు. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. సాగు నీరు కోసం పదే పదే తెలంగాణ రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అంటూ మండిపడ్డారు. మా వాటాకు మించి ఒక్క నీటి చుక్క వాడుకోలేదన్నారు. ఈ వివాదం చంద్రబాబు టైమ్ లోనూ జరిగింది.. సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధం.. మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలి.. పురంధేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు.. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అసమర్థత వల్ల తెలంగాణ పోలీసులు.. ఏపీ భూభాగంలోకి వచ్చారు.. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, ఓడించాల్సిన అవసరం మాకు లేదు.. తెలంగాణ రాజకీయాలపై మాకు ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు, ఆయన సామాజికవర్గం ఓ కులానికి మద్దతు ఇచ్చిందా? అని గుర్తు చేశారు.

Recent

- Advertisment -spot_img