Homeసినిమాబాలయ్య సినిమా కోసం భారీ యాక్షన్ సెట్

బాలయ్య సినిమా కోసం భారీ యాక్షన్ సెట్

నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్​లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ ఉందట. ఇప్పుడు ఈ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో బాలయ్య యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్​గా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్​లో ఈ యాక్షన్ సీక్వెన్స్​ను షూట్ చేయాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య గెటప్ కూడా హైలెట్​గా ఉంటుందట. అలాగే సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్​గా ఉంటుందఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదని.. ఇదో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్​తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్​లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img