ఇదే నిజం నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని లెంకలపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల నాయకుడు మామిండ్ల ఐలయ్య ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం శనివారం నుంచి ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమలు చేయడం హర్షనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి పని చేస్తుందని అందుకు నిదర్శనమై ఈ హామీల అమలు అని వారన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి మామిండ్ల కొమురయ్య, నాయకులు ఇమ్మడి కుమారస్వామి, కొమండ్ల రంగయ్య, కోమాండ్ల రమేష్ , కొమండ్ల రాముషా, నూటంకి మొగిలి , కొలిపాక రాజు బత్తిని అశోక్, కీసర్ శంకర్, వెంకటేష్, అన్నారం కోటి, కంది గొండ నాగరాజు, సాంబయ్య, ఆకుల సారయ్య, నారాయణ పాల్గొన్నారు.