Homeఆంధ్రప్రదేశ్Chandrababu : తుపాన్‌ బాధితులను ఆదుకోండి

Chandrababu : తుపాన్‌ బాధితులను ఆదుకోండి

– ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

  • జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి

ఇదేనిజం, ఏపీ బ్యూరో:మిచాంగ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిందని, ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని బాధితులను ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. మిచాంగ్‌ తుపాన్‌ను జాతీయవిపత్తుగా ప్రకటించాలని కోరారు. అందుకు తగిన విధంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సుమారు 15జిల్లాల్లో తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపించిందని.. మొత్తం 22 లక్షల ఎకరాల్లో 10 వేల కోట్ల మేర పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అయితే మొత్తం తుపాను సృష్టించిన నష్టం అంచనా వేసేందకు కేంద్ర బృందాన్ని పంపించాలని కోరారు. తుపాను దాటికి చేతి కొచ్చిన పంటలు నీట మునిగాయి. వరి, మిర్చి వంటి అనేక పంటలు మోకాలు లోతు నీటిలో మునిగిపోయి కుళ్లిపోయాయి. ఎకరాలకు లక్ష రూపాయల పెట్టుబడిపెట్టి నిలువునా నష్టపోయామంటూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారమంతా తాకట్టు పెట్టి పొలం మీద పెట్టుబడి పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img