Homeక్రైంఅప్రూవర్​గా మారుతా.. అనుమతివ్వండి

అప్రూవర్​గా మారుతా.. అనుమతివ్వండి

– న్యూస్ క్లిక్ కేసులో ఢిల్లీ కోర్టను ఆశ్రయించిన ఆ సంస్థ హెచ్​ హెడ్ అమిత్ చక్రవర్తి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భారత్‌కు చెందిన ఆన్‌లైన్ వార్తల పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ వార్తా సంస్థ హెచ్​ ఆర్(హ్యూమన్ రిసోర్స్) హెడ్ అమిత్‌ చక్రవర్తి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్‌క్లిక్‌కు బీజింగ్‌ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో క్షమాపణ కోరుతూ, అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇవ్వాలని అమిత్‌ చక్రవర్తి దిల్లీ కోర్టును ఆశ్రయించారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని దిల్లీ పోలీసులకు వెల్లడిస్తానని కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి అమిత్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో గతంలో డిల్లీలోని న్యూస్‌ క్లిక్ ఆఫీసులో ఈడీ సోదాలు నిర్వహించింది. అనంతరం న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పురకాయస్థ సహా 25 మంది వాంగూల్మాన్ని నమోదు చేసింది. ఇటీవల ఈడీ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. అనంతరం ప్రబీర్‌, అమిత్‌ను అరెస్టు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్​సీఆర్ఏ) రూల్స్​ను ఉల్లంఘించిందని సీబీఐ కేసు నమోదు చేసి ప్రబీర్‌ నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించి ఆస్తులను జప్తు చేసింది.

Recent

- Advertisment -spot_img