Homeజిల్లా వార్తలు‘పాలమూరు’ పార్లమెంటు ఎవరిది?

‘పాలమూరు’ పార్లమెంటు ఎవరిది?

– బీజేపీ, కాంగ్రెస్​లో టికెట్​ ఫైట్​
– బీఆర్ఎస్​ అభ్యర్థి ఎవరు?
– ఇంట్రెస్ట్​ చూపించని స్టిట్టింగ్​ ఎంపీ మన్నె!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పాలమూరు పార్లమెంటు సీటులో ఎవరు గెలుస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మూడు పార్టీలు ఈ సీటును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలో పాలమూరు టికెట్​ కోసం పోటీ నెలకొన్నది. అయితే సిట్టింగ్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తున్నది. దీంతో ఆయన స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. ఇక మరో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరు? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఈ సారి మాత్రం తాను పోటీ చేయనంటున్నారట. రాజకీయాలంటే తెలియని తాను అనవసరంగా ఈ రొచ్చులోకి వచ్చానని భావిస్తున్నారట. మరి ఆయన స్థానంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీగా బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అటు వైపుగా ఆయన పావులు కదుపుతున్నారట.

బీజేపీ టికెట్​ కోసం ఆ ఇద్దరి పోటీ

ఇక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జితేందర్​ రెడ్డి ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. డీకే అరుణ గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి పోటీ చేసి ఓడిపోయారు. ఇక మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్నారట. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. జితేందర్ రెడ్డి కుమారుడికి అసెంబ్లీ టికెట్ కేటాయించిన బీజేపీ ఈ సారి ఆయనకు అవకాశం ఇవ్వదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున మన్నె జీవన్ రెడ్డి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని మన్నె జీవన్ రెడ్డి భావించారు. కానీ కొన్నికారణాల వల్ల అలా జరగలేదు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట జీవన్ రెడ్డి. స్థానిక ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడైన మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరి లోకి దిగుతారనే చర్చ ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక పార్లమెంటు ఎన్నికల వైపు దృష్టి సారించారు ఆశావాహులు. మారుతున్న రాజకీయాల నేపధ్యంలో ఈ సారి పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Recent

- Advertisment -spot_img