ఇదే నిజం, వెబ్ డెస్క్: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి మహాలక్ష్మీ పథకం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చిన పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, హైదరాబాద్‌లో మెట్రో, ఆర్డినరీ బస్సుల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ పురుష ప్రయాణీకులకు ప్రయాణించేందుకు సీట్లు ఉండటం లేదనే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బస్సుల్లో పురుషుల కోసం 20 సీట్లను రిజర్వ్ చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త బస్సులను అందుబాటులోకి తేవడం ద్వారా పురుష ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందులకు పులిస్టాప్ పెట్టనున్నట్లు సమాచారం.