ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ నుండి సరికొత్త పోస్టర్ తో పాటు, గ్లింప్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కాగా ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపించాడు.. పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. ఇక గ్లింప్స్ వీడియో ని జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.