తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల చివరిలోగా అర్హులైన మహిళలకు రూ.2500 సాయం అందించే పథకాన్ని అమలులోకి తెచ్చేందుంకు ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే దీనిని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్‌తో ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది.
రాష్ట్రంలో సగానికిపైగా మహిళా ఓటర్లే ఉన్నందున రూ.2500 సాయం హామీ అమలు సైతం రాజకీయంగా కలిసొస్తుందన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇదిలా ఉండగా ఈ స్కీమ్‌ను అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది? ఖజానాపై ఎంత భారం పడుతుంది? అర్హులను గుర్తించడం ఎలా.. ఇలాంటి అంశాలన్నింటిపై త్వరలో క్లారిటీ రానుంది.