Homeహైదరాబాద్latest Newsఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్

ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్

టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహించనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇది మహిళలకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. ప్రత్యేక సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు. కాకపోతే జీరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయనన్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. చార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

Recent

- Advertisment -spot_img