కొద్ది రోజులుగా చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం చికెన్ ధరలు భారీగా తగ్గుమొఖం పడుతున్నాయి. గత వారం హైదరాబాద్ నగరంలో కేజీ చికెన్ ధర రూ.250 ఉండగా ప్రస్తుతం అది రూ.180కి తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో అయితే కేజీకి రూ.160 చొప్పున కూడా అమ్ముతున్నారు. ఐదు రోజుల నుంచి చికెన్ ధరలు పడిపోతున్నాయి. డిమాండ్ కు మించి కోళ్ల ఉత్పత్తిని పెంచడంతో ధరలు తగ్గుతున్నాయిని వ్యాపారులు అంటున్నారు. కూరగాయల విషయానికి వస్తే.. బీర కాయ కిలో రూ.90 నుంచి రూ.100 వరకు, బెండకాయ కిలో రూ.70 నుంచి రూ.80 వరకు, టమాటలు కిలో రూ.30 వరకు మార్కెట్లో అమ్ముతున్నారు.