Homeఅంతర్జాతీయంBandla Ganesh హాట్ కామెంట్స్..:Latest Viral

Bandla Ganesh హాట్ కామెంట్స్..:Latest Viral

మాజీ మంత్రులు KTR, హరీష్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. నోటికి ఏదస్తే అదే మాట్లాడుతున్నారు విమర్శించారు. ఈ రోజు గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ రోజు హరీష్ రావు, మరో రోజు కేటీఆర్, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తెలంగాణను ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణలో ఎన్నో తరాలు గుర్తు పెట్టుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉందని, బీఆర్ఎస్ ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారని నిలదీశారు. తెలంగాణ ప్రజలు మోసపోయారని వారు మాట్లాడుతున్నారని, జనం చాలా విజ్ఞతతో ఉంటారని అన్నారు.

ప్రజలు అందరికంటే తెలివిగల వాళ్లని అందుకే గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను చూసి ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు.

ప్రతి ఒక్క మంత్రి దైర్యంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. గతంలో సీఎం ప్రెస్‌మీట్ పెడితే దళిత మంత్రిని పక్కన కుర్చోనివ్వకుండా వెళ్లగొట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పాలన చేస్తుందని, ప్రజాపాలన పథకాలకు అర్హులైన ప్రజలకు ఇస్తుందని బండ్ల గణేష్ చెప్పారు.

Recent

- Advertisment -spot_img