Homeహైదరాబాద్latest Newsబండ్లగణేష్ డ్రైవర్ భార్య సూసైడ్

బండ్లగణేష్ డ్రైవర్ భార్య సూసైడ్

బండ్ల గణేష్ డ్రైవర్ భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బానోత్ చందన, రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నారు.

రమణ కొద్ది రోజుల నుంచి బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చందన ఓ కంపెనీలో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తుంది. అయితే సోమవారం వారిద్దరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

రమణ డ్యూటీలో ఉండగా చందన కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారమిచ్చి డ్యూటీ నుంచి బయల్దేరాడు. యజమాని వెళ్లిచూడగా.. ఫ్యాన్ కు వేలాడుతూ.. కనిపించింది. చుట్టు పక్కల వారి సాయంతో తలుపులు బద్దులుకొట్టి లోనికి వెళ్లి చూడగా ఆమె మృతిచెంది ఉంది. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు బంజారాహిలస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img