Homeజిల్లా వార్తలుకురవి ఆలయ చైర్మన్ పదవి లంబాడీలకే ఇవ్వాలి

కురవి ఆలయ చైర్మన్ పదవి లంబాడీలకే ఇవ్వాలి

– సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరావత్​ వెంకన్న నాయక్

ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: కురవి ఆలయ చైర్మన్​ పదవి లంబాడీలకే ఇవ్వాలని సేవాలాల్​ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరావత్​ వెంకన్న నాయక్​ పేర్కొన్నారు. ఆలయ చైర్మన్​ పదవిని లంబాడీ బిడ్డలకే ఇవ్వాలని కోరారు. మంగళవారం కురవి ఆలయ సత్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా బంజారాలు ఆరాధించే దైవం కురవి వీరభద్రస్వామి అని పేర్కొన్నారు. ఆ దేవుడిని 70 శాతం లంబాడి బిడ్డలే కొలుస్తారన్నారు. లంబాడీల ఆరైద్యదైవమైన కురవి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ లంబాడి బిడ్డ అయితే ఈ ఆలయానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్తాడని అభిప్రాయపడ్డారు. ఆలయభూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ నందులాల్ నాయక్, సేవాలాల్ సేన కురవి మండల నాయకులు నాగేశ్​ నాయక్, బొడ సేవ్య నాయక్, రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img