Homeజిల్లా వార్తలుదళితబంధు లబ్ధిదారులకు గ్రౌండింగ్​ ప్రక్రియ పూర్తి చేయండి

దళితబంధు లబ్ధిదారులకు గ్రౌండింగ్​ ప్రక్రియ పూర్తి చేయండి

– నల్లబెల్లి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట దళితసంఘాల ఆందోళన

ఇదేనిజం, నల్లబెల్లి : దళితబంధు లబ్ధిదారులకు వెంటనే గ్రౌండింగ్​ ప్రక్రియ పూర్తి చేయాలని దళితసంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు వారు మంగళవారం నల్లబెల్లి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలంలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు రెండో ఫేజ్​ కింద 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆన్​ లైన్​ ప్రక్రియ సైతం పూర్తయ్యింది. కాగా నల్లబెల్లి మండలంలోని వీరిలో ఒక 147 మంది లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులు కలెక్టర్​ లాగిన్​ లో ఉన్నాయి. కాగా ఈ డబ్బును వెంటనే విడుదల చేయాలని దళితులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపీటీసీ జన్ను జయరాం, దళిత సంఘాల నాయకులు, దళితబంధు దరఖాస్తు దారులు బోట్ల పవన్​, బట్టు సాంబయ్య, అడ్డ రాజు, బొమ్మ కంటి అనిల్, నత్తి శ్యామ్, పరికి నవీన్, పరికి రత్నం తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img