ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ గ్రౌండ్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వినర్ నాతరి స్వామి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇక నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాలకు సంబంధించిన టీమ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవా సమితి అధ్యక్షుడు ఉస్మాన్ , కనుకుంట్ల రాజేశ్, నాతరీ మూర్తి, జూపల్లి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.