Homeహైదరాబాద్latest Newsవారికి TSTRC గుడ్ న్యూస్.. ఇందులో మీరున్నారా..?

వారికి TSTRC గుడ్ న్యూస్.. ఇందులో మీరున్నారా..?

ఆర్టీసీలో ప‌ని చేస్తూ విధి నిర్వహణలో చనిపోయిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలిచ్చారు. 813 మంది దానికి అర్హులుగా ఉన్నారని.. విధుల్లోకి తీసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.

హైద‌రాబాద్‌ రీజియన్ నుంచి 66, సికింద్రాబాద్‌లో 126, రంగారెడ్డి 52, న‌ల్గొండ 56, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 83, మెద‌క్ 93, వ‌రంగ‌ల్ 99, ఖ‌మ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, క‌రీంన‌గ‌ర్‌లో 45 మంది కండక్టర్లను భర్తీ చేయనున్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్ల సమస్యకు చెక్ పెట్టామన్నారు. చాలా సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తూ.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు న్యాయం చేశామని మంత్రి పొన్నం అన్నారు.

Recent

- Advertisment -spot_img