HomeసినిమాDevara సీన్స్​ Hollywood​ నుంచి లేపేశారా?

Devara సీన్స్​ Hollywood​ నుంచి లేపేశారా?

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ పాన్​ ఇండియా రేంజ్​లో దేవర మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. కొరటాల మూవీ డైరెక్షన్​ లో ఈ మూవీ రాబోతున్నది. ఇటీవల వదిలిన గ్లింప్స్ ఫ్యాన్స్​ను అలరించింది. ఈ రేంజ్ క్వాలిటీ ఊహించలేదని అంతా అన్నారు. దేవర హాలీవుడ్ రేంజ్​లో ఉంటుందని కల్యాణ్​ రామ్ డెవిల్ ప్రొమిషన్స్ లో దేవర గురించి హైప్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కొంత మంది సినీ ప్రియులు దేవర గ్లింప్స్ చూసి హాలీవుడ్​ కాపీ అంటున్నారు. అందులోని షాట్స్ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని కనిపెట్టారు. కొరటాల శివ ఇలా దెబ్బేశాడేంటి? అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. వికింగ్స్ ఇంట్రో సాంగ్ నుంచి ఈ షాట్స్‌ను వాడాడని, ఉన్నది ఉన్నట్టుగా లేపేశాడంటూ కొరటాల మీద ట్రోల్స్​ నడుస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img