Homeజిల్లా వార్తలుగోపాలపురం గుడిసెల కూల్చివేత దుర్మార్గం

గోపాలపురం గుడిసెల కూల్చివేత దుర్మార్గం

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు

ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా గోపాలపురం మండలంలో పేద ప్రజల గుడిసెల కూల్చివేత ఎంతో దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు పేర్కొన్నారు. హనుమకొండ మండలం గోపాలపురం చెరువుశిఖంలో రెండేండ్లుగా కొందరు పేదలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఈ గుడిసెలను పోలీసులు ఇటీవల కూల్చేశారు. దీంతో సీపీఎం పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. గుడిసెలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్ట్స్ & సైన్స్ ఆడిటోరియం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అంటూ సీపీఎం కార్యకర్తలు, గుడిసెలు కోల్పోయిన బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం సిపిఎం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చుక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్, జి.రాములు, డి.తిరుపతి, మంద సంపత్, జిల్లా నాయకులు నోముల కిషోర్, జయశ్రీ, ఓ సాంబయ్య, వల్లెపు రాజు, కే కుమార్, అశోక్, యాకయ్య, వెంకటయ్య, లింగమూర్తి, మల్లయ్య, కొమురెల్లి, ఎం.రమ, ఉమా, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img