Homeజిల్లా వార్తలుCreative ​గా ఆలోచించండి

Creative ​గా ఆలోచించండి

– విద్యార్థులకు సూచించిన ఎంఈవో సామ్యనాయక్​

ఇదే నిజం, దేవరకొండ: విద్యార్థులు క్రియేటివ్​ గా ఆలోచించాలని ఎంఈవో సామ్యా నాయక్​ విద్యార్థులకు సూచించారు. నేరేడుగొమ్మ మండల కేంద్రంలో స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో గురువారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సామ్యనాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రీయదృక్ఫథంతో సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే ఆవిష్కరణలు పండుతాయని మారుమూల ప్రాంతామైన, నేరేడుగొమ్మ ప్రాంతంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఝాన్సీలక్షీబాయి, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, వైఎస్ ఎంపీపీ ముత్యాలమ్మ , జెడ్పీటీసీ బాలు నాయక్, సీఏసీఎస్​ చైర్మన్​ జాల నరసింహ రెడ్డి, ఎస్సై రాజు, ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img