– శ్రీరామభజనతో హోరెత్తిన వీధులు
ఇదే నిజం, ఉప్పల్: గడపగడపకు అయోధ్య అక్షతల వితరణ జోరుగా సాగుతోంది. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఊరూరా ఈ అయోధ్య అక్షతల వితరణ కార్యక్రమం సాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ బ్యాంక్ కాలనీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గడపగడపకి అక్షతల వితరణ కార్యక్రమం చేపట్టారు. వీహెచ్ పీ అఖిలభారత జాయింట్ సెక్రటరీ మాననీయ సత్యంజీ, విశ్వహిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ముక్తేశ్వర్ రెడ్డి, ఉప్పల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్, వీహెచ్ పీ నేతలు సునీల్ నాయక్, ప్రశాంత్ నగర్ బస్తి కలశ ప్రముఖ్ దేవకి నందన శర్మ, ప్రశాంత్ నగర్ బస్తీ ప్రముఖ్ కొండల్ రావు, శ్రీనివాస్ శర్మ, ఏవీఎస్ శాస్త్రి, కే నరసింహ, జగదీశ్ జోషి, వైఎస్ఎన్ ప్రసాద్, ప్రదీప్, గజేంద్ర పాల్ వర్మ, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, కిరణ్, అసోసియేషన్ ప్రముఖులు, బస్తి వాసులు పాల్గొన్నారు.