Homeజిల్లా వార్తలుఆయిల్​ ఫామ్​ రైతులను ప్రోత్సహిస్తున్నాం

ఆయిల్​ ఫామ్​ రైతులను ప్రోత్సహిస్తున్నాం

– ‘ఇదేనిజం’ ఇంటర్వ్యూలో హార్టికల్చర్ అధికారి జ్యోతి

ఇదే నిజం, నర్సంపేట: రైతుల్లో ప్రోత్సాహం నింపుతున్నామని హార్టికల్చర్ అధికారి జ్యోతి పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్​ సాగు చేస్తున్న రైతులకు అంతర పంటలకు సంబంధించిన రాయితీ సొమ్ము త్వరలో వారి ఖాతాలో జమ కానున్నదని డివిజన్​ ఉద్యానశాఖ అధికారి తెలిపారు. దీనికోసం జీపీఎస్​ విధానం ద్వారా తోటల పరిశీలన కార్యక్రమం పూర్తి చేస్తున్నామన్నారు. హార్టి కల్చర్​ అధికారి జ్యోతి ఇదేనిజం దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.

ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం ఎంతవరకు సాధించారు?

డివిజన్ పరిధిలోని 762 ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేశారు. కొత్తగా 1322 ఎకరాల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సంవత్సరం రైతులకి అవగాహన కల్పించుకుంటూ ప్రభుత్వ సహకారంతో అవగాహన కల్పిస్తున్నాము.

ఆయిల్ ఫామ్ మొక్కలకు కొరత ఉందా?
కొరత లేదు. రైతులకి ఎల్లవేళలా మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

రైతులకు బిందు సేద్యం రాయితీ పరికరాలను ఎప్పుడు సరఫరా చేస్తారు?
దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికే కేటాయించాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బడ్జెట్ కేటాయిస్తే రైతులకి బిందు సేద్య పరికరాలు అందిస్తాం.

రాయితీపై కూరగాయల నారు అందుబాటులో ఉందా?
మిర్చి టమాటో వంకాయ నారు అందుబాటులో ఉంది.

ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి సాగుకు అనుకూలం?
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు టమాటో, మిర్చి, వంకాయ లాంటి కూరగాయల పంటలు సాగుచేసుకోవడం ఉత్తమం.

Recent

- Advertisment -spot_img