Homeజిల్లా వార్తలుసాఫ్ట్ బాల్ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన ఇనుగుర్తి బాలిక

సాఫ్ట్ బాల్ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన ఇనుగుర్తి బాలిక

ఇదే నిజం,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్ సెకండియర్​ చదువుతున్న ఎడ్ల దీపిక సౌత్ జోన్ సీనియర్ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైంది. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనపరచడంతో ఆమె జాతీయ పోటీలకు ఎంపికయింది. దీంతో కళాశాల ప్రిన్సిపల్ బీ భాగ్యం, వైస్​ ప్రిన్సిపల్ బీ వెంకయ్య, పీడీ బీ కవిత, పీఈటీ ఈ మహేశ్వరి, జిల్లా సాఫ్ట్​ బాల్​ అధ్యక్షుడు పీ సంజీవరావు, కార్యదర్శి ఎస్​ ప్రేమ్ కుమార్, క్రీడాకారిని దీపికను అభినందించారు.

Recent

- Advertisment -spot_img