- నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాలు
- ఉత్సాహంగా పాల్గొన్న కళాశాల విద్యార్థిని, విద్యార్థులు
– 17 వరకూ కొనసాగనున్న కార్యక్రమాలు
ఇదే నిజం ప్రతినిధి వరంగల్: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలలలో గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలపై యువతకు అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందితో శిక్షణ నిర్వహించి.. సందేహాల నివృత్తి చేపట్టారు. ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న నేషనల్ యూత్ వీక్ లో భాగంగా రహదారి భద్రత అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా వడ్డేపల్లిలోని పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, ఎర్రగట్టుగుట్టలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్స్ (కిట్స్)లలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పింగళి కాలేజీ ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ చంద్రమౌళి, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ రామకృష్ణారెడ్డి, ఎన్ఎస్ఎస్ పీఓ డాక్టర్ రాధిక, ట్రాఫిక్ ఏసీపీ ఎం భోగరాజు, ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత, ఎంవీఐలు స్రవంతి, ఫహిమా, ఎన్‌వైకే యూత్ ఆఫీసర్ చింతల అన్వేష్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ., యూత్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కిట్స్ కాలేజీ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోకరెడ్డి, ఎన్ఎస్ఎస్ పీఓలు డాక్టర్ సీహెచ్ సతీశ్ చంద్ర, సంతోషి భార్గవి, ట్రాఫిక్ ఏసీపీ ఎం. భోగరాజు, ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి, ఎంవీఐలు స్రవంతి, ఫహిమా, ఎన్‌వైకే యూత్ ఆఫీసర్ చింతల అన్వేష్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యూత్ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.