ఇదే నిజం, ప్రతినిధి వరంగల్: దాడి కేసులో ఇద్దరు నిందితులను పరకాల కోర్టు జైలు శిక్ష విధించింది. 2015వ సంవత్సరంలో హన్మకొండ జిల్లా పులిగిల్ల గ్రామానికి చెందిన దద్దు సమ్మయ్యపై ఓ భూ వివాదంలో అతడి సోదరులు రాజయ్య, సాంబయ్య దాడి చేశారు. ఈ దాడిలో సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు పరకాల పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితులను పరకాల కోర్టు ఎదుట హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శాలిని లింగం వీరికి రెండేండ్ల జైలు శిక్ష, 10 వేల జరిమానా విధించారు