Homeజిల్లా వార్తలువెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలి

వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలి

– హౌజ్​బుజుర్గ్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సయ్యద్ షరీఫ్

ఇదేనిజం, ఆత్మకూరు : కాంగ్రెస్ పార్టీ కోసం గత 15 సంవత్సరాలుగా కష్టపడుతున్న ఇనగాల వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వాలని హౌజ్​బుజుర్గ్​ గ్రామ కాంగ్రెసప్​ యూత్​ అధ్యక్షుడు సయ్యద్​ షరీఫ్​ డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, కేసులు పెట్టినా భయపడకుండా అన్నింటిని తట్టుకొని పార్టీ కోసం, కార్యకర్తల కోసం ముందునిలిచారన్నారు. అందుకే ఇనగాలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img