Homeహైదరాబాద్latest Newsఅచ్చంపేటలో వైభవంగా శివపార్వతుల కల్యాణం.. హాజరైన MLA

అచ్చంపేటలో వైభవంగా శివపార్వతుల కల్యాణం.. హాజరైన MLA


– హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఉమా మహేశ్వర క్షేత్రంపై శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆయన సతీమణి అనురాధ హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్, ఈవో శ్రీనివాసరావు ప్రధాన అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో వివిధ గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు ప్రభ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అచ్చంపేట పట్టణంలోని అంబగుడి ఆలయం వద్ద నిర్వహించిన ప్రభ మహోత్సవానికి గువ్వల బాలరాజు, అయన సతీమణి అమల హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img