– సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్
ఇదేనిజం, హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. త్వరలో కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ లో పాఠశాలలను నెలకొల్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. సైనిక్ స్కూల్ ను మంజూరు చేయడంతోపాటూ పాఠశాలలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని.. అందుకు వేరే చోట స్థలం ఇస్తామని సీఎం ప్రతిపాదించారని తెలుస్తోంది. సైనిక్ స్కూల్ కోసం రూ. 100 కోట్లు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారని సమాచారం.