Homeహైదరాబాద్latest Newsమినిస్టర్ గా కోదండ రాం!

మినిస్టర్ గా కోదండ రాం!

కోదండ రాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఏర్పడ్డాక BRS ప్రభుత్వం లో ఆయనకు ఎక్కడా అంత ప్రాధాన్యత లభించలేదు. అనంతరం తెలంగాణ జన సమితి పార్టీ ని స్థాపించి 2018లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ అంత ప్రభావం చూపలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలిచారు. అయితే ఆయనకు ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఏమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అయితే త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరగనుందని.. ఆయనకు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యా శాఖలో కోదండ రాం అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img