Homeహైదరాబాద్latest Newsఅందుకే పెళ్లి వాయిదా వేసుకున్నా

అందుకే పెళ్లి వాయిదా వేసుకున్నా

– సాయిపల్లవి

టాలీవుడ్ లో నేచురల్ బ్యూటీ అంటే టక్కున చెప్పే పేరు సాయి పల్లవి. చాలా మంది కుర్రాళ్ళు ఇలాంటి లవర్ ఉండాలి అని అనుకునే క్వాలిటీస్ అన్ని ఈ అమ్మడిలో ఉంటాయి. చూడటానికి మన పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తన నటనతో ఏంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కుర్రది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది సాయి పల్లవి ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి రీసెంట్ గా ఓ సినిమాను అనౌన్స్ చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సాయి పల్లవి. రీసెంట్ గా సాయి పల్లవి సిస్టర్ పూజ పెళ్లి జరగనుంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగింది. పూజ పెళ్లి వేడుకలో సాయి పల్లవి డాన్స్ లతో సందడి చేసింది. సాయి పల్లవి, పూజా పెళ్ళిలో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని అభిమానుల మధ్య చర్చ మొదలైంది. అక్కడ పెళ్లి చేసుకోకుండా చెల్లికి పెళ్లి చేయడం ఏంటి అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే తన పెళ్లి గురించి గతంలో సాయి పల్లవి మాట్లాడింది. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సాయి పల్లవి మాట్లాడుతూ.. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకి వివాహంచేసుకోవాలని అనుకున్నా.. అలాగే 30 ఏళ్ల లోపు పిల్లలను కూడా కన్నేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాపై కొన్ని బాధ్యతలు పడ్డాయి. దాంతో పెళ్లి వాయిదా వేశా.. సినిమాల్లో మంచి పేరు రావడంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోకుండదు అని అనుకుంటున్నా అని తెలిపింది సాయి పల్లవి.

Recent

- Advertisment -spot_img